Fraud: ఉద్యోగాలిస్తామని బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ..
ABN, Publish Date - Oct 10 , 2024 | 08:14 PM
ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినార్జీ యూనివర్సల్ అనే కంపెనీ నిరుద్యోగులకు టోకరా వేసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. కావూరిహిల్స్ లోని వీవీ చాంబర్స్ నాలుగో అంతస్తులో ఉన్న సినార్జీ యూనివర్సల్ కంపెనీ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది. అనంతరం బాధితులకు ఆఫర్ లెటర్ చేతికిచ్చి వర్క్ ఫ్రాం హోమ్ అని చెప్పి ఆరు నెలలు గడిపేసింది. అలా దాదాపు 500 మంది దగ్గర డబ్బులు తీసుకుంది.
జీతాలు చెల్లించకపోవడంతో..
అయితే గత ఆరు నెలల నుండి జీతాలను చెల్లించడం లేదని కంపెనీ యజమాన్యాన్ని ఉద్యోగులు ప్రశ్నించారు. ప్రాజెక్టులు లేవని అందుకే జీతాలు చెల్లించలేకపోతున్నామని సినార్జీ తెలిపింది. దీనికితోడు గత కొద్ది రోజుల నుంచి యజమాన్యం ఆఫీస్‌కు కూడా రావట్లేదు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన ఉద్యోగులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూ.కోట్లతో పరారైన కంపెనీ ప్రతినిధులను వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. బాధితులు రూ.కోట్లలో ఉండడంతో EOW లో ఫిర్యాదు చేయాలని మాదాపూర్ పోలీసులు సూచించారు.
Ratan Tata: మొబైల్ కూడా వాడని రతన్ టాటా సోదరుడు.. ఈయన మీకు తెలుసా
Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..
Ratan Tata: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?
Ratan Tata: రతన్ టాటా లేరన్న వార్తను నమ్మలేకపోతున్నా: ఆనంద్ మహీంద్రా
Updated Date - Oct 10 , 2024 | 08:15 PM