Sankranti 2024: పండగపూట విషాదాలు.. ప్రాణాలు తీసిన గాలిపటాలు
ABN, Publish Date - Jan 16 , 2024 | 12:47 PM
Telangana: సంక్రాంతి పండగ పలువురి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగురవేసిన పలువురు యువకులు, చిన్నారులు అనుకోకుండా మృత్యువుబారిన పడ్డారు. కొందరు గాలిపటాలు విద్యుత్ తీగలకు ఇరుక్కుని విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాలిపటాలు ఎగురవేస్తూ భవనాల పైనుంచి పడి మృతి చెందారు.
హైదరాబాద్, జనవరి 16: సంక్రాంతి పండగ పలువురి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగురవేసిన పలువురు యువకులు, చిన్నారులు అనుకోకుండా మృత్యువుబారిన పడ్డారు. కొందరు గాలిపటాలు విద్యుత్ తీగలకు ఇరుక్కోవడంతో వాటిని తీస్తుండగా విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాలిపటాలు ఎగురవేస్తూ భవనాల పైనుంచి పడి మృతి చెందారు. దీంతో తెలంగాణ గాలిపటాల కారణంగా ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు.
బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో పతంగులు ఎగురవేస్తూ ఓ యువకుడు బలి అయ్యాడు. అలాగే యాప్రాల్‌లోనే గాలిపటం ఎగురవేస్తూ భువన్ సాయి అనే బాలుడు నాలుగవ అంతస్తు పైనుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇటు మధురానగర్‌లోనూ విషాదం చోటు చేసుకుంది. పతంగులు ఎగురవేస్తూ చౌహన్ దేవ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. మధురానగర్ రహ్మత్‌నగర్‌లోని ఐదంతస్తుల భవనం పైనుంచి పడిపోవడంతో చౌహన్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే చౌహాన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చౌహాన్ స్నేహితులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 16 , 2024 | 12:47 PM