ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 03:27 PM

మహారాష్ట్రలో ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ నకిలీ అంగ వైకల్యానికి సంబంధించిన పత్రాలతో ఐఏఎస్ హోదా పొందారంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవే ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణలోని ఓ ఐఏఎస్ అధికారిని చిక్కుల్లోకి నెట్టాయి.

Praful Desai IAS

హైదరాబాద్, జులై 18: మహారాష్ట్రలో ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ నకిలీ అంగ వైకల్యానికి సంబంధించిన పత్రాలతో ఐఏఎస్ హోదా పొందారంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవే ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణలోని ఓ ఐఏఎస్ అధికారిని చిక్కుల్లోకి నెట్టాయి. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్‌ ఫ్రపుల్ దేశాయ్ సైతం ఇదే తరహాలో నకిలీ అంగ వైకల్యం పత్రాలు.. పొందారనే విమర్శలు అయితే మొదలైనాయి.

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన


ఫ్రపుల్ దేశాయ్‌ సైకిల్ తొక్కుతున్న ఫొటో, గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోతోపాటు హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతున్న ఫోటలు సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అంగవైకల్యముంటే ఆయన ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటూ నెటిజన్లు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. యూపీఎస్‌సీ పరీక్షల్లో అంగవైకల్యం కోటాను ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 యూపీఎస్‌సీ పరీక్షల్లో 532వ ర్యాంక్ ఫ్రపుల్ దేశాయ్ సాధించారు.


స్పందించిన ఐఏఎస్..

తనపై వస్తున్న ఆరోపణలపై ఫ్రపుల్ దేశాయ్ స్పందించారు. తన కాలికి అంగవైకల్యం ఉందన్నారు. ఆ క్రమంలో కొన్ని శారీరక పనులు తాను స్వయంగా చేసుకోలేనని వివరించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు... ఐఏఎస్‌ శిక్షణలో భాగంగా తీసుకున్నవని తెలిపారు. తన అంగవైకల్యానికి సంబంధించి బెళగావి ఆసుపత్రి గతంలో జారీ చేసిన సర్టిఫికేట్‌ సైతం తన ఉందని.. అలాగే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తనకు 45 శాతం అంగవైకల్యం ఉందని సరిఫికేట్‌ జారీ కూడా చేసిందని పేర్కొన్నారు.


ఈ వైకల్యం కారణంతో తాను అస్సలు నడవలేనని కాదు.. కానీ స్నేహితులతో కొంచెం ఆడుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తరచు కాకుండా.. ఎప్పుడన్నా తన స్నేహితులతో బ్యాట్మంటన్ ఆడతానన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోలపై ఆయన సోదాహరణగా వివరించారు. నడిచినప్పుడైనా తన స్నేహితులతో కలిసి నడిచినట్లు చెప్పారు. అలాగే శిక్షణలో భాగంగా పర్వాతారోహణ చేశానన్నారు. గుర్రపు స్వారీ మాత్రం.. శిక్షకుడు పర్యవేక్షణలోనే చేశానని గుర్తు చేసుకున్నారు. అయితే సోషల్ మీడియాలోని తనపై నెటిజన్లు చేస్తున్న కామెంట్ల పట్ల ఫ్రపుల్ దేశాయ్ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


వ్యక్తిగత జీవితంతో ఫ్రపుల్ దేశాయ్ ఇబ్బందులు..

కర్ణాటకలోని బెళగావి జిల్లా ఫ్రపుల్ దేశాయ్ స్వస్థలం. రైతు కుటుంబానికి చెందిన అతడు.. అయిదేళ్ల వయస్సులో ఎడమ కాలికి పోలియో సోకింది. అయితే తన ఎడమ కాలు పూర్తిగా పక్షవాతానికి గురి కాలేదని చెప్పారు. కానీ దాదాపు కొంత వైకల్యం మాత్రం ఉందన్నారు. ఇక కర్ణాటకలోని నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా కొన్నాళ్లు విధులు నిర్వహించానని.. అలా యూపీఎస్‌సీ పరీక్షలు రాసి ఐఏఎస్ సాధించినట్లు ఫ్రపుల్ దేశాయ్ వివరించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 04:29 PM

Advertising
Advertising
<