డాక్టర్ సునీతకు ‘ఐడీఎ్‌సఏ ఫెలోషిప్’
ABN, Publish Date - May 13 , 2024 | 04:35 AM
అపోలో ఆస్పత్రి డాక్టర్ సునీత నర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎ్‌సఏ) ఫెలోషిప్’ లభించింది.
అభినందనలు తెలిపిన ‘అపోలో’ జేఎండీ సంగీతారెడ్డి
హైదరాబాద్ సిటీ, మే 12 (ఆంధ్రజ్యోతి): అపోలో ఆస్పత్రి డాక్టర్ సునీత నర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎ్‌సఏ)(IDSA ) ఫెలోషిప్’ లభించింది. డాక్టర్ సునీత అంకితభావం, నాయకత్వం, నైపుణ్యం, రోగుల సంరక్షణ ఐడీఎ్‌సఏకు ఎంతగానో దోహదపడతాయని సంస్థ అధ్యక్షుడు స్టీఫెన్ కె.స్మిత్ అన్నారు. వ్యాధుల రంగంలో డాక్టర్ సునీత చేసిన కృషికి గాను ఈ ఫెలోషిప్ దక్కిందని తెలిపారు.
(IDSA )ఐడీఎ్‌సఏ ఫెలోషిప్ దక్కినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సునీత చెప్పారు. ఐడీఎ్‌సఏ ఫెలోషిప్ పొందినందుకు డాక్టర్ సునీతను అభినందిస్తున్నామని అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి అన్నారు. అంటు వ్యాధుల రంగంలో ఆమె అలుపెరగని కృషి, ఆరోగ్య సంరక్షణలో నిబద్ధత అపోలో అస్పత్రికి గర్వకారణమని ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - May 13 , 2024 | 04:35 AM