ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎంను విమర్శిస్తే ఖబడ్దార్‌

ABN, Publish Date - Mar 09 , 2024 | 11:08 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ అంటూ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌

- మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 9 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ అంటూ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ హెచ్చరించారు. మాజీ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌ కాంగ్రెస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని, రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రిని పెద్దన్న అంటున్నారని, అంటే బీజేపీ కాంగ్రెస్‌ ఒకటేనని పెద్దన్న మోదీ, చిన్నన్న రేవంత్‌కు గుణపాఠం చెప్పాలని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలిస్తే బీఆర్‌ ఎస్‌ నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు ఇంతియాజ్‌ ఆ పార్టీ లో ఉండి కనీస గౌరవానికి నోచుకోలేదని, చైర్మన్‌ అయినప్పుడు ఒక సత్కారం లేదని ఎంతో మందితో చెప్పుకుని బాధపడ్డ ఆయన ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే అందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమే కారణమని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎంపై, కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రకటించిన ఎంపీల తొలిజాబితాలోనే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా చల్లావంశీచంద్‌రెడ్డి పేరు ప్రకటించడం, అలానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి పేరు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కష్ఠపడి ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారం దుర్మార్గమైనదని చెప్పారు. నాయకులు సిరాజ్‌ఖాద్రి, షబ్బీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:08 PM

Advertising
Advertising