ఉద్యోగ అర్హత వయసు పెంపు
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:33 AM
ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయసును రెండేళ్లు పెంచారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు (జీవో నంబరు ఎంఎస్-30) జారీ చేశారు. ఈ నిర్ణయంతో జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఉద్యోగ అర్హత వయసు 46 ఏళ్లకు పెరిగింది. రిజర్వేషన్ అభ్యర్థులకు ఆయా కేటగిరీల వారీగా గరిష్ఠ అర్హత వయసు
రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
46 ఏళ్లకు చేరిన వయో పరిమితి
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయసును రెండేళ్లు పెంచారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు (జీవో నంబరు ఎంఎస్-30) జారీ చేశారు. ఈ నిర్ణయంతో జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఉద్యోగ అర్హత వయసు 46 ఏళ్లకు పెరిగింది. రిజర్వేషన్ అభ్యర్థులకు ఆయా కేటగిరీల వారీగా గరిష్ఠ అర్హత వయసు అమలు పరచనున్నారు. గ్రూపు-1 పోస్టులకు సంబంధించిన పరీక్ష రద్దు, తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దాంతో అభ్యర్థులు అర్హత వయసును రెండేళ్లు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 34 ఏళ్లుగా ఉన్న ఉద్యోగాలకు గరిష్ఠ అర్హత వయసును గత ప్రభుత్వం పదేళ్లు పెంచింది. ఈ మేరకు 2022 మార్చి 19న (జీవో నంబరు ఎంఎస్-42) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం మరో రెండేళ్లు పెరిగింది. దాంతో మొత్తం 12 ఏళ్లు పెరిగినట్టు అయింది. రిజర్వేషన్ అమలయ్యే కేటగిరీ అభ్యర్థులకు ఈ గరిష్ఠ వయసు విషయంలోనూ కొంత వెసులుబాటు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీ్‌సమెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు సడలింపు ఉంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రెండేళ్ల పెంపుతో గరిష్ఠ అర్హత వయసు ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 51 ఏళ్లు, ఎక్స్ సర్వీ్‌సమెన్, ఎన్‌సీసీసీ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 56 ఏళ్లు అయింది. అయితే ఈ పెంపు నిర్ణయం యూనిఫాం ఉద్యోగాలకు వర్తించదు.
అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల తుది కీ విడుదల
మునిసిపల్ శాఖలోని అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు, గ్రౌండ్ వాటర్ విభాగంలోని గెజిటెడ్ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది కీని విడుదల చేశారు. దీన్ని టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు ప్రకటించారు.
సమాంతర మహిళా రిజర్వేషన్ అమలుకు వివరాల సేకరణ
ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సమాంతర మహిళా రిజర్వేషన్ అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోస్టర్ పాయింట్లలో మార్పు లేకుండా ఈ రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఆయా పోస్టుల వివరాలు ఇవ్వాలని టీఎ్‌సపీఎస్సీ అధికారులు అన్ని విభాగాలకు లేఖ రాశారు.
Updated Date - Feb 13 , 2024 | 07:55 AM