Jharkhand: హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు.. ప్రత్యేక విమానంలో 43 మంది ఎమ్మెల్యేలు
ABN, Publish Date - Feb 01 , 2024 | 08:43 PM
జార్ఖండ్(Jharkhand) సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) రాజీనామా, అరెస్ట్ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress) పార్టీలు తలమునకలయ్యాయి.
రాంచీ: జార్ఖండ్(Jharkhand) సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) రాజీనామా, అరెస్ట్ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress) పార్టీలు తలమునకలయ్యాయి. ఇందులో భాగంగా 43 మంది ఎమ్మెల్యేలను రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్(Hyderabad)కి తరలిస్తున్నారు.
మంత్రి చెంపై సోరెన్(Chamapai Soren) వెంట రెండు ప్రత్యేక విమానాల్లో వస్తున్న వీరంతా గురువారం రాత్రి బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి చేరుకోనున్నారు. భాగ్యనగరానికి చేరుకున్నాక.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారిని క్యాంపులకు తరలించనున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు లేదా అబ్దుల్లాపూర్ మెట్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారంటూ సంతకాలు చేయించిన లేఖను చెంపై సోరెన్ ఇదివరకే గవర్నర్‌కు అందజేశారు. ఎమ్మెల్యేలంతా తదుపరి సీఎంగా చెంపైకే మద్దతు ఇస్తున్నారు.
గవర్నర్‌కు లేఖలో..
చంపై గురువారం సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకున్నారు. తనకు మద్దతుగా ఉన్న 43 ఎమ్మెల్యేల లేఖను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. గవర్నర్‌తో సమావేశానంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాల్సిందిగా తాము గవర్నర్‌ను కలిసి కోరినట్టు చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
''ప్రస్తుతం మాకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందుకు సంబంధించిన రిపోర్ట్‌ను గవర్నర్‌కు సమర్పించాం. ఆ సంఖ్య 46 నుంచి 47కు చేరుతుంది. ఎలాంటి సమస్య లేదు. మా ఘట్‌బంధన్ చాలా పటిష్టంగా ఉంది'' అని వివరించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2024 | 09:24 PM