మేడారం జాతర వెళ్లే భక్తులకు ఏర్పాట్లు చేయాలి
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:48 AM
మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఇబ్బందు లు పడకుండా బస్‌షెల్టర్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఇబ్బందు లు పడకుండా బస్‌షెల్టర్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించారు. సోమవారం ఆయన ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసే మేడారం జాతర ప్రత్యేక బస్‌షెల్టర్ పాయింట్‌ను, ఐటీఐ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో బస్‌పాయంట్ వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేకమైన టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంగణంలో పారిశుద్ధ్యం నిర్వ హణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేయాలని, అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించాలని మున్సిపల్ కమిష నర్‌కు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితుల డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించా రు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని, అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్, ఐటిఐ ప్రిన్సిపాల్, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:48 AM