ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అడుగంటుతున్న భుగర్భ జలాలు...

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:12 AM

మండలంలోని అన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయ బావులపై, బోర్లపై నమ్మకంతో రైతులు వరి పంటలు వేశారు.

చిగురుమామిడి, ఫిబ్రవరి 11: మండలంలోని అన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయ బావులపై, బోర్లపై నమ్మకంతో రైతులు వరి పంటలు వేశారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో భూగర్భ జలాలు తగ్గుతాయి. ఈసారి ఫిబ్రవరిలోనే ఇలాంటి దుస్థితి రావడంతో రైతులు తీవ్ర అందోళన చెందుతున్నారు. రైతులు ఎన్నో ఆశలతో వేసిన వరి పొలాలు నీళ్లు లేక ఎండి పోతున్నాయి. ఎంతో కొంత మేరకు నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు వ్యవసాయ బావుల్లో పూడికలు తియ్యడానికి క్రేన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో వ్యవసాయ బావుల్లో పూడికలు తియ్యడానికి ప్రభుత్వం అర్థిక సహాయం అందించి రైతులను ఆదుకునేది. అలాంటి పథకాలను మళ్లీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా వరదా కాలువ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత భూములకు సాగునీరివ్వాలని రైతులు అంటున్నారు.

- పూడిక తీయ్యడానికి నిధులు ఇవ్వాలి..

- ఎలగందుల రాజయ్య, రైతు, నవాబుపేట

గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బావుల్లో పూడిక తియ్యడానికి నిధులు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా నిధులు ఇవ్వాలి. బావుల్లో నీళ్లు లేక పొలాలు ఎండుతున్నాయి. వరద కాలువ పనలు పూర్తి చేసి ఉంటే మాకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు.

- శాశ్వత పరిష్కారం చూపించాలి..

- తళ్లపెల్లి చంద్రయ్య, రైతు, సుందరగిరి

ప్రతి యేడూ యాసంగిలో రైతులకు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసారి ఫిబ్రవరిలోనే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంత సాగునీటి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలి.

Updated Date - Feb 12 , 2024 | 12:12 AM

Advertising
Advertising