ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gangavva: గంగవ్వపై కేసు నమోదు.. కారణం ఇదే

ABN, Publish Date - Oct 23 , 2024 | 05:52 PM

‘మై విలేజ్ షో’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

జగిత్యాల: ‘మై విలేజ్ షో’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై జగిత్యాలలో కేసు నమోదయింది. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో ఒక చిలుకను ఉపయోగించడంపై ఫిర్యాదు రావడంతో జగిత్యాల ఎఫ్‌ఆర్‌వో కేసు నమోదు చేశారు.


గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా అటవీశాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు. జగిత్యాల ఎఫ్ఆర్‌వో పద్మారావు ఈ కేసు నమోదు చేశారు. గౌతమ్ అనే జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదుదారు పేర్కొన్నట్టు చెప్పారు. కాగా కేసు నేపథ్యంలో యూట్యూబర్ రాజు రూ.25 వేలు జరిమానా కట్టాడని వెల్లడించారు.


జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫిర్యాదు

యూట్యూబ్ ఛానల్ వీడియో కోసం చిలుకను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గౌతమ్ అనే జంతు సంరక్షణ కార్యకర్త జగిత్యాల జిల్లా ఫారెస్ట్ అధికారికి అక్టోబర్ 6వ తేదీన లేఖ రాశారు. మే 20, 2022న మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని తమరికి ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘గంగవ్వ చిలుక పంచాంగం’ పేరిట పబ్లిష్ చేసిన ఈ వీడియోలో జ్యోతిషం కోసం చిలుకను ఉపయోగించారని, ఈ వీడియోలో రాజుతో పాటు గంగవ్వ కూడా ఉందని గౌతమ్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 4 ప్రకారం భారతీయ చిలుకను మనం సంరక్షించుకుంటున్నామని, కాబట్టి ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కోరారు. వారిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌతమ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

HCA: హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ

ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

తుపాను ఎఫెక్ట్.. రెండు రైళ్లు రద్దు

For more TS News and Telugu News

Updated Date - Oct 23 , 2024 | 07:20 PM