ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కన్నుల పండువగా మార్కండేయుడి శోభాయాత్ర

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:49 AM

‘విఠలా... విఠలా.. పాండురంగా’ అంటూ శివభక్త మార్కండేయస్వామి నామస్మరణతో స్వామివారి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివభక్త మార్కండేయ స్వామి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు.

మార్కండేయస్వామి రథోత్సవం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

‘విఠలా... విఠలా.. పాండురంగా’ అంటూ శివభక్త మార్కండేయస్వామి నామస్మరణతో స్వామివారి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివభక్త మార్కండేయ స్వామి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి దేవస్థానంలో స్వామివారి మహాయజ్ఞం చేపట్టారు. సాయంత్రం మార్కండేయస్వామి శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై మార్కండేయస్వామి ఉత్సవ విగ్రహంతో దేవస్థానం నుంచి బయలు దేరిన యాత్ర గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, చేనేత చౌక్‌, పెద్దబజార్‌ మీదుగా వేంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా కొనసాగింది. శోభాయాత్రలో పద్మబ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రలో భాగంగా గాంధీ, అంబేద్కర్‌, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఉత్సవాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మార్కండేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం ప్రతినిధులు బొల్లి రామ్మోహన్‌, డాక్టర్‌ గాజుల బాలయ్య, మ్యాన రవి, మోర రవి, వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం, కార్యదర్శి వెల్దండి దేవదాస్‌, మోర రాజు, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, సెస్‌ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దిడ్డి రమాదేవి, గుజ్జెతార, అడెపు చంద్రకళ, దార్నం అరుణ, పత్తిపాక పద్మ, కట్టెకోల లక్ష్మీనారాయణ, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:49 AM

Advertising
Advertising