ఓరియంట్‌లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:02 AM
దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో స్ధానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ బదా వత్ సంతోష్‌కు ఓరియంట్ సిమెంటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్య పాల్ రావు, ఆదివాసీ సంఘం నాయకులు వినతిపత్రం అం దించారు.
స్టాఫ్ అండ్ వర్కర్స్ నాయకులు కలెక్టర్‌కు వినతి
కాసిపేట, ఫిబ్రవరి 12: దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో స్ధానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ బదా వత్ సంతోష్‌కు ఓరియంట్ సిమెంటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్య పాల్ రావు, ఆదివాసీ సంఘం నాయకులు వినతిపత్రం అం దించారు. ఓరియంట్ సిమెంటు కంపెనీ నుంచి వచ్చే దుమ్ముధూళితో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నా రని, రైతులు పంటలు నష్టపోతున్నారన్నారు. ఓరి యంట్ ప్రభావిత గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిం చాలని కోరారు. మైన్స్ లీజును ఆదివాసీ సొసైటీ పేరుమీద రిజిస్ర్టేషన్ చేసి పనులను కొనసాగించాలని, డీఎంఎఫ్‌టీ నిధులను ఓరియంట్ ప్రభావిత గ్రామా ల్లోనే ఖర్చు చేసి అభివృద్ధికి కృషి చేయాలని, విద్య, వైద్యం, తాగు నీరు సదుపాయాలను కల్పించాలని విన్నవించారు. ఓ రియంట్ యాజమాన్యం సమ స్యలను పరిష్కరించకపోతే ఈనెల 15న దేవాపూర్‌లో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డు కుంటామని తెలిపారు. మడావి వెంకటేష్, కనకరాజు, రాజు, జైతు, అచ్యుత్‌రావు, బాపు, రాజం, జనార్దన్ పాల్గొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:02 AM