ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:50 AM

పేదరిక నిర్మూలన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృ త్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అర్హు లైన వారందరూ వాటిని వినియోగించుకోవాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్‌ సేతీ అన్నారు.

పెద్దపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృ త్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అర్హు లైన వారందరూ వాటిని వినియోగించుకోవాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్‌ సేతీ అన్నారు. సోమవారం పెద్దపల్లిలోని భూంనగర్‌లో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ దేశంలోని పేదరికం తొలగించేందుకు కేంద్ర ప్రభు త్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో వివిధ కార్యక్రమాల ను చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత దేశం సాధిస్తున్న పురోగతి గురించి చర్చించుకుంటున్నారని, ప్రజల వద్దకు పాలన అందిస్తూ అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించేందుకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను చేపట్టామని తెలిపారు. తపాలా శాఖ ద్వారా సుకన్య యోజన, మహిళా సమ్మా న్‌ ఖాతా అనే పథకాలకు అధిక వడ్డీ అందిస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద 5లక్షల వరకు ఉచితంగా చికిత్స అంది స్తున్నామని, ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ కనెక్షన్‌ లేని పేద మహిళ లకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తున్నామని, సిలిండర్‌పై సైతం 300సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. పీఎంఎస్‌బీవై పథకం కింద 2లక్షల ప్రమాద బీమా, పీఎంజెజేబీవై పథకం కింద 2 లక్షల సాధా రణ బీమా అందిస్తున్నామని తెలిపారు. ఆధార్‌సెంటర్‌ ద్వారా ప్రతి ఒక్కరూ తమ వివరాలను అప్‌ డేట్‌ చేసుకోవాలని ఆయన సూచిం చారు. బ్యాంక్‌ ద్వారా దేశ ప్రజలందరికి ఆర్థిక అక్షరాస్యత అందిం చేందుకు అవగాహన క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వ్యాపార నిమిత్తం సెక్యూరిటీ లేకుండా లక్ష నుంచి 3 లక్షల వరకు ముద్రా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం స్వానిధి పథ కం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా వికసిత భారత ప్రతిజ్ఞ చేసిన అనంతరం తపాలా శాఖ, ఉజ్వల్‌, ఆయూష్మాన్‌ భారత్‌, బ్యాంక్‌, ఆర్థిక అక్షరా స్యత, మొదలగు కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్విజ్‌ నిర్వహించి సరైన సమాధానాలు చెప్పిన వారికి టీషర్ట్‌ క్యాపులను అందజేసి, కార్యక్ర మంలో పాల్గొన్న వారికి క్యాలెండర్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్‌డీవో సీహెచ్‌ మధు మోహన్‌, పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, ఎల్‌డీఎం వెంకటేష్‌, వార్డ్‌ కౌన్సిలర్‌, సంబంధిత అధికారులు, మెప్మా పీడీ అర్బన్‌ రజినీ, ఎంఎ ల్‌ హెచ్‌పీ నవ్య, మెప్మా సిబ్బంది, మహిళలు, ఆశా వర్కర్లు, ఆర్‌పీ లు మెడికల్‌, మున్సిపల్‌, పోస్టాఫిస్‌, గ్యాస్‌ ఏజెన్సీ సభ్యులు, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:50 AM

Advertising
Advertising