నైపుణ్యం పెంపొందించేలా టాస్క్ సెంటర్
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:52 AM
యువతలో నైపుణ్యం పెంపొందించడానికి టాస్క్‌సెంటర్ ఏర్పాటు దిశగా ప్రత్యేక కార్యా చరణ అమలుచేస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): యువతలో నైపుణ్యం పెంపొందించడానికి టాస్క్‌సెంటర్ ఏర్పాటు దిశగా ప్రత్యేక కార్యా చరణ అమలుచేస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హాతో కలిసి కలెక్టర్ ఐటీఐ లోని పాత కలెక్టరెట్ కార్యాలయం, ఎంపీడీవో ప్రాంగణంలో పాత ప్రభుత్వ కార్యాలయాలు, పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికా రి కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజ మ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ పరిశ్రమలకు నాణ్యమైన మానవ వన రులు, సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సమన్వయం తీసుకురావడానికి టాస్క్ సెంటర్ దోహదప డుతుందని తెలిపారు. యువతకు నైపుణ్య అభివృద్ధికి శిక్షణ అం దించేందుకు టాస్క్ సెంటర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించార ని, దాని ప్రకారం ఐటి, ఇతర రంగాల్లో ఉపాధి నైపుణ్య శిక్షణకు నిపుణులు జిల్లాకు వచ్చి టాస్క్‌సెంటర్ ఏర్పాటుకు అనువైన ప్రభు త్వ భవనాలను పరిశీలించారని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట టాస్క్ మేనేజర్‌లు ప్రదీప్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గంగాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్, సం బంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:52 AM