మహిళల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
ABN, Publish Date - Mar 05 , 2024 | 11:47 PM
కేంద్ర ప్రభుత్వం మహిళ హక్కులను కాలరాస్తూ వారి శ్రమకు తగ్గ గుర్తింపును ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురా లు అరుణజ్యోతి అన్నారు.
కోల్‌సిటీటౌన్, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం మహిళ హక్కులను కాలరాస్తూ వారి శ్రమకు తగ్గ గుర్తింపును ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురా లు అరుణజ్యోతి అన్నారు. అంతర్జాయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గోదావరిఖని ప్రధానచౌరస్తాలోని ఐద్వా కార్యాలయంలో మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన అరుణ జ్యోతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల కాలంలో మహిళలు, చిన్నారుల పై దాడులు, అత్యాచారాలు బాగా పెరిగాయన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎని మిది గంటల పనివిధానం కోసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మహిళ లకు ఓటు హక్కు కల్పించాలని తదితర డిమాండ్ల హక్కుల సాధన కోసం సాఽగిన ఉద్యమమే మహిళా దినోత్సవం అని గుర్తు చేశారు. నేడు బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా మతం పేరుతో మతోన్మాద చర్యలు చేపడుతోం దని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ చట్టసభల్లో ఇప్పటివరకు 33శాతం రిజర్వే షన్ ఎందుకు కల్పించలేదనే దానిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీఐటీయూ మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ జ్యోతి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సాగర్, ఐద్వా జిల్లా కమిటీ నాయకురాలు పైమద,రమణ, భాగ్య, భావాని, శ్రీను పాల్గొన్నారు.
Updated Date - Mar 05 , 2024 | 11:47 PM