ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అణగారిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Feb 20 , 2024 | 12:07 AM

అణగారిన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభు త్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

చెక్కు అందజేస్తున్న ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, ఫిబ్రవరి 19 : అణగారిన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభు త్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మం డల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరు స్తుందన్నారు. త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. సర్పంచ్‌ పాలన ముగిసిందని, ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాజకీయాలకతీతంగా వేముల వాడ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో తీసు కెళ్తానన్నారు. తహసీల్దార్‌ విజయప్రకాశరావు, మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ వంగపల్లి సుమలత, ఎంపిటిసి యాస్మిన్‌ భాష, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌ పాషా, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు చెందనగిరి గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:07 AM

Advertising
Advertising