ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాహనాలను కండీషన్‌లో ఉంచుకోవాలి

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:56 PM

పోలీస్‌ వాహనాలను సొంత వాహనాల్లా ఎప్పుడూ కండీషన్‌లో ఉంచుకో వాలని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అధికారులు, డ్రైవర్లను ఆదేశించారు.

కోల్‌సిటీ, ఫిబ్రవరి 27: పోలీస్‌ వాహనాలను సొంత వాహనాల్లా ఎప్పుడూ కండీషన్‌లో ఉంచుకో వాలని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అధికారులు, డ్రైవర్లను ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్‌ ప్రాంగణంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పరిధిలోని పోలీస్‌ వాహనాల పని తీరు, నిర్వహణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ వాహనాలు నిరం తరంగా ప్రజా సేవకు వినియోగిస్తున్నామన్నారు. వాహనాల నిర్వహ ణపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వాహనాలను కండీషన్‌లో ఉంచుకో వాలన్నారు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌, ఇంజన్‌ ఆయిల్‌, టైర్ల నిర్వహణ పనులపై డ్రైవర్లు దృష్టి పెట్టాలన్నారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆయన ఎంటీఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, ఆర్‌ఐ దామోదర్‌, ఎంటీఓలు శ్రీనివాస్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:56 PM

Advertising
Advertising