ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పూర్తయ్యేదెన్నడు?

ABN, Publish Date - Feb 25 , 2024 | 11:53 PM

మండలంలోని నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కాలువల పనులు ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఈ రిజర్వాయర్‌ పనులు 19 ఏళ్ల క్రితం ప్రారంభించారు. పనులు పూర్తి చేస్తే ఎడమ, కుడి కాలవల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ఉప కాలువలతో గొలుసుకట్టు చెరువులు నింపవచ్చు. పదేళ్ల క్రితం ఎడమ కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి.

గంగాధర, ఫిబ్రవరి 25: మండలంలోని నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కాలువల పనులు ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఈ రిజర్వాయర్‌ పనులు 19 ఏళ్ల క్రితం ప్రారంభించారు. పనులు పూర్తి చేస్తే ఎడమ, కుడి కాలవల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ఉప కాలువలతో గొలుసుకట్టు చెరువులు నింపవచ్చు. పదేళ్ల క్రితం ఎడమ కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి. గత ప్రభుత్వం 10 శాతం పనులను పెండింగ్‌లో పెట్టింది. ఎడమ కాలువ లింకు డి1 కాలువకు సిమెంటు చేయలేదు. రెండేళ్ల క్రితం కుడికాలువ పనులను ప్రారంభించగా నత్తనడకన సాగుతున్నాయి. కరీంనగర్‌, జగిత్యాల ప్రఽధాన రహదారిపై కాలువ పెండింగ్‌లో ఉంది. వే ములవాడ దారిలో వంతెన పూర్తయినా చిన్నచిన ్న పనులు చేయాల్సి ఉంది. ప్రధాన రహదారి నుంచి వేములవాడ వరకు పలువురి ఇళ్లు కాలువలో పోతున్నాయి. వాటికి పరిహారం అందించి పనులు చేయడంలో జాప్యం జరుగుతోంది. కుడికాలువకు 20 ఏళ్ల క్రితం భూముచ్చిన రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కుడికాలువ పూర్తయితే గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాలకు సాగునీటితో పాటు తాగునీటి ఇబ్బందులు తొలుగుతాయి. కొత్త ప్రభుత్వం నారాయణపూర్‌ రిజర్వాయర్‌ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలని కోరుతున్నారు.

- మరమ్మతులు కరువు

ఎడమ కాలువ ద్వారా కొంతప్రాంతానికి సాగునీరు అందిస్తున్నారు. డి1 కాలువ సిమెంటు పనులు నాణ్యత లోపంతో పగుళ్లుబారియి. పగుళ్లు ఉన్న ప్రాంత్రంలో నీరు వృథాగా పోతోంది. 20 కిలోమీటర్ల మేర ఉన్న కాలువ గోడలకు పిచ్చిమొక్కలు, తుమ్మ చెట్లు పెరిగి సిమెంటు రాలిపోతోంది. నీటిపారుదల శాఖ అధికారులు ఈ కాలువను పట్టించుకున్న పాపాన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రిజర్వాయర్‌, కాలువ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరిందించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:53 PM

Advertising
Advertising