ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchiryāla- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, Publish Date - Feb 13 , 2024 | 11:00 PM

ప్రజలు, దుకాణదారులు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మేదరిపేటలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీని సందర్శించి పలు సూచనలు చేసారు.

మేదరిపేటలో వ్యాపారులకు సూచనలు చేస్తున్న డీపీవో

దండేపల్లి, ఫిబ్రవరి 13: ప్రజలు, దుకాణదారులు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మేదరిపేటలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీని సందర్శించి పలు సూచనలు చేసారు. అనంతరం దుకాణదారులకు ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన కల్పించారు. వారి వద్ద నుంచి నిషేదిక ప్లాస్టిక్‌ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల సహకారంతోనే వారి భాగస్వామ్యంతోనే గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా ఉంటాయన్నారు. షాపుల ముందు చెత్త వేసే వారికి జరామానా విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సంధ్యారాణి, ఎంపీవో శ్రీనివాస్‌, కార్యదర్శి శ్రావణ్‌ కుమార్‌, సిబ్బంది సతీష్‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలి

హాజీపూర్‌: పారిశుధ్య సిబ్బంది చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని డీపీవో వెంకటే శ్వర్‌రావు అన్నారు. మండంలోని గుడిపేట గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులను మంగళ వారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న డ్రైనేజీల్లో పూడికతీ ప నులను పరిశీలించి సూచనలు చేశారు. ప్రజలకు, కిరాణ దుకాణాల యాజమా నులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించాలని చెప్పారు. రోడ్లు, మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని చెత్తబుట్టల్లో వేసి పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు అందించాలని సూ చించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:00 PM

Advertising
Advertising