ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: కేసీఆర్‌కు ఉహించని పరిణామం

ABN, Publish Date - Mar 28 , 2024 | 07:19 PM

టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ కంచర్లపల్లి కేశవరావు మీడియా ప్రతినిధులపై రుసరుసలాడారు. ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపైకి ఆయన వేగంగా దూసుకొచ్చి.. నన్ను వీడియో తీసుకొండంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాద్, మార్చి 28: బీఆర్‌ఎస్ పార్టీకి (BRS Party) మరో భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించని విధంగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది. తన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ఎల్లుండి (శనివారం) హస్తం పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఈ మేరకు గురువారం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కేకేతో పాటు ఆయన కుమార్తె మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్ మున్షితో భేటీ అయ్యారు. పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో కే కేశవ రావుని పిలిపించుకొని కేసీఆర్ ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కేకేపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం తక్కువ జరిగిందంటూ కేసీఆర్ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కేకే నేరుగా ఇంటికి వెళ్లారు. తన నివాసం వద్ద వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై ఆయన రుసరుసలాడారు. తన ఫ్రస్ట్రేషన్‌ను మీడియాపై ప్రదర్శించారు. మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి సైతం అప్పటికే కేకే ఇంటి వద్ద వేచి చూసి భేటీ అయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మరోవైపు కేకే కుమారుడు విప్లవ్ కుమార్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను మాత్రం పార్టీ మారడం లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే తన సోదరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పార్టీ మారతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ నాయకుడు గులాబీ బాస్ కేసీఆర్ అని విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు.

మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 07:44 PM

Advertising
Advertising