ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భళా బాహుబలి

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:24 PM

సందెరాళ్లు, ఇసుక సంచులు, దొబ్బుడు గుండ్లు ఎత్తి ఎత్తి బళా అనిపించారు కొందరు రియల్‌ హీరోలు.

సందెరాయి ఎత్తు పోటీలో మొదటి స్థానం పొందిన మిట్టదొడ్డి ఉరుకుంద

- ఉత్సాహంగా బరువులెత్తే పోటీలు

- కొనసాగుతున్న తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

అయిజ, మార్చి 1 : సందెరాళ్లు, ఇసుక సంచులు, దొబ్బుడు గుండ్లు ఎత్తి ఎత్తి బళా అనిపించారు కొందరు రియల్‌ హీరోలు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో బరువులు ఎత్తు పోటీలు నిర్వహించారు. సందెరాళ్ళు ఎత్తే పోటీలో గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఉరుకుంద 100 కిలోల బరువు ఒక్కసారిగా ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు. కర్ణాటకలోని రాయిచూరు జిల్లా మల్లేబాద్‌ గ్రామానికి చెందిన నిజాం 100 కిలోల బరువును ప్రయత్నం మీద ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు. అయిజ మండలం మేడికొండకు చెందిన రాజు 95 కిలోల బరువు ఎత్తి మూడవ స్థానంలో నిలిచారు. ఇసుక సంచులు ఎత్తే పోటీలో కర్ణాటకలోని యాదగిరి జిల్లా శారదపల్లికి చెందిన మరియప్ప 200 కిలోల బరువు ఉన్న ఇసుక సంచి ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు. కర్ణాటకకు చెందిన పరశురాముడు 190 కిలోలు ఎత్తి ద్వితీయ స్థానంలో, కర్ణాటకకు చెందిన సాభన్న 185 కిలోలు ఎత్తి మూడవ స్థానాన్ని దక్కించు కున్నారు. దొబ్బుడు గుండు ఎత్తే పోటీలో అయిజ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన లాల్‌బాషా 160 కిలోల బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు. కర్ణాటక రాష్ట్రం షాపూర్‌కు చెందిన పక్కీరప్ప 150 కిలోల బరువును ఒకే సారి ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు. అయిజ మండలం వెంకటాపూర్‌కు చెందిన షబ్బీర్‌ 150 కిలోల బరువును ప్రయత్నం మీద ఎత్తి మూడవ స్థానంలో నిలిచారు. పోటీలను తిలకిం చేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - Mar 01 , 2024 | 11:24 PM

Advertising
Advertising