ఘనంగా వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 14 , 2024 | 10:58 PM
వసంత పంచమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
- చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
నారాయణపేట, ఫిబ్రవరి 14 : వసంత పంచమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సరస్వతి మాత పుట్టిన రోజు కావడంతో వేద పండితుల మంత్రోశ్ఛరణల మధ్య పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. సింగార్ బేస్ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన దత్తప్ప మాట్లాడుతూ సరస్వతీ దేవి జన్మతిథి ప్రకారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి గడియలలో రేవతి నక్షత్రం, మీన లగ్నంలో ప్రవేశించిందని, ఈ రోజు అక్షరాభ్యాసానికి మంచిరోజు అన్నారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో 62 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో సరస్వతీ శిశు మందిర్ విద్యాపీఠం గౌరవాధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, కార్యదర్శి కుంటి ఎల్లప్ప, విభాగ్ విద్యావత్ పరిషత్ కన్వీనర్ లక్ష్మయ్య, గోపాన్ బాయి, బాలరాజు, హెచ్‌ఎం దత్తుచౌద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నారాయణపేట జవహర్ బాల కేంద్రంలో ఎస్పీ బాలు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వసంతి పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చైర్మన్, జిల్లా గవర్నర్ హరినారాయణ భట్టడ్, ఫిజిషియన్ డాక్టర్ గందె కార్తీక్, జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు సరస్వతీ చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవి జ్ఞానేశ్వర్ గౌడ్‌ను శాలువా, పూలమాలతో సత్కరించారు. చిన్నారులకు పిల్లన గ్రోవిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాయకుడు సంగ నర్సింహులు, వసంత్, జ్ఞానామృత పాల్గొన్నారు. నారాయణపేట 3వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో కౌన్సిలర్, బీజేపీ పుర ప్లోర్ లీడర్ సత్యరఘుపాల్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
Updated Date - Feb 14 , 2024 | 10:58 PM