ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా ఎక్లాస్‌పూర్‌ తిమ్మప్ప జాతర

ABN, Publish Date - Feb 25 , 2024 | 10:59 PM

మండలంలోని ఎక్లాస్‌పూర్‌ తిమ్మప్ప జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. శ

తిమ్మప్ప ఆలయం వద్ద భక్తుల రద్దీ

- ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట/రూరల్‌, ఫిబ్రవరి 25 : మండలంలోని ఎక్లాస్‌పూర్‌ తిమ్మప్ప జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. శనివారం అర్ధరాత్రి దాటాక స్వామి వారి మహా రథోత్సవాన్ని భక్త జనుల శరణుగోషల మధ్య ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి అర్చకుడు మాణిక్‌ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో రెట్టపట్ల పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. పరిసర గ్రామాలతో పాటు కర్ణాటక పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎక్లాస్‌పూర్‌ గ్రామం కిక్కిరిసిపోయింది. జాతరలో రంగుల రాట్నాలు, మిఠాయి దుకాణాలు, గాజుల దుకాణాలు వెలిశాయి. అంతకుముందు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు మాణిక్‌ శాస్త్రీ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించి శాలువా, పూలమాలతో సత్కరించారు. మోహన్‌లాల్‌ లాహోటీ జ్ఞాపకార్థం జాతరకు వచ్చే భక్తులకు నిర్వహించిన అన్నదానంతో పాటు ప్రభావతి దేవి గిరీష్‌ లాహోటీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ హరినారాయణ బట్టడ్‌, కౌన్సిలర్‌ సలీం, శ్రీనివాస్‌ లాహోటి, జి.విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సదాశివారెడ్డి, మనోహర్‌ ప్రసాద్‌గౌడ్‌, వకీల్‌ సంతోష్‌, ఊశప్ప, ఆనంద్‌, బోయ శరణప్ప పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 10:59 PM

Advertising
Advertising