ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నామినేటెడ్‌ పదవులపై నాయకుల ఆశలు

ABN, Publish Date - Feb 29 , 2024 | 11:29 PM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను నియమిం చేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ దృష్టి సారించడంతో జిల్లాలోని మూడు వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్ల పదవులు పొందేందుకు ఆశావాదులు ఆరాట పడుతున్నారు.

పేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం

- మార్కెట్‌ కమిటీలపై దృష్టి సారించిన ప్రభుత్వం

- ఎమ్మెల్యే ఆశీస్సులు పొందేందుకు ఆశావాహుల ఆరాటం

నారాయణపేట, ఫిబ్రవరి 27 : వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను నియమిం చేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ దృష్టి సారించడంతో జిల్లాలోని మూడు వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్ల పదవులు పొందేందుకు ఆశావాదులు ఆరాట పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 12న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ర ద్దు చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్‌ కమిటీల పాలకవర్గం రద్దుతో ఇన్‌చార్జి అధికారులతో మార్కెట్‌ కొనసోగుతోంది. కాగా జిల్లాలోని కోస్గి వ్యవసాయ మార్కెట్‌ యార్డు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలోకి వ స్తోంది. ఈ మార్కెట్‌ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌ కెటగిరిలో రిజర్వు ఉండడంతో చైర్మన్‌ పదవి ఆశిస్తున్న వారు తమకు కావల్సిన వారి నుంచి సిఫారసు చేస్తున్నారు. ఈ మార్కెట్‌ పరిధిలో మద్దూర్‌, కోస్గి ఉమ్మడి రెండు మండలాలు ఉన్నాయి. ఇది వరకు మద్దూర్‌కు చెందిన వీరారెడ్డి కోస్గి చైర్మన్‌ పదవిని దక్కించుకోగా, ఈ సారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ గిరిని కోస్గికి చెందిన వారికి కేటాయించే అవకాశముంది. చైర్మన్‌ పదవి ఆశిస్తున్న ఆశావాదులు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ద్వారా సి ఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది. మక్తల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆశావాదులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆశీస్సులు పొంది, ఎలాగైనా చైర్మన్‌ గిరిని దక్కించుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక పేట వ్యవసాయ మార్కెట్‌ పదవి ఓసీ జనరల్‌ కావడంతో చైర్మన్‌ పదవి కోసం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆశీస్సులతో పొందాలని ఆశావాదులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి ఆశీస్సులు పొందేందుకు ఫైరవీలు జోరందుకున్నాయి. పేట మండలానికి చైర్మన్‌ పదవి, వైస్‌ చైర్మన్‌ పదవి పేట పట్టణానికి చెందిన ఒక సామాజికవర్గానికి కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రమించిన ముఖ్య నాయకులు కూడా చైర్మన్‌ గిరి పొందాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేయడం, మరోపక్క పదవిని ఆశిస్తున్న ఆశావాదుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీలో మార్కెట్‌ పదవుల కాక వేడెక్కుతోంది.

Updated Date - Feb 29 , 2024 | 11:29 PM

Advertising
Advertising