ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హైదరాబాద్‌కు వెళ్లిన కొత్త కానిస్టేబుళ్లు

ABN, Publish Date - Feb 14 , 2024 | 11:09 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకునేందుకు జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారు

నియామక పత్రాలు అందుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న కానిస్టేబుళ్లు

- జెండా ఊపి బస్సును ప్రారంభించిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఫిబ్రవరి 14 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకునేందుకు జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారు సోమవారం ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో పోలీస్‌ శాఖ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు బస్సుల్లో వారంతా హైదరాబాద్‌కు బయలు దేరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి 222 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని తెలిపారు. వారిలో 188 మంది పురుషులు, 34 మంది మహిళలు ఉన్నారన్నారు. వారందరూ బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటారని తెలిపారు. జిల్లా నుంచి మొత్తం ఐదు ప్రత్యేక బస్సుల్లో అందరినీ హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, ఏఆర్‌ డీఎస్పీ నరేందర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 11:09 PM

Advertising
Advertising