ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ABN, Publish Date - Feb 28 , 2024 | 11:04 PM

విద్యార్థులు శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈవో అబ్దుల్‌ ఘనీ అన్నారు.

పేట సరస్వతీ శిశు మందిర్‌లో చిన్నారుల సైన్స్‌ ప్రదర్శనలు

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, డీఈవో అబ్దుల్‌ ఘనీ

- ఘనంగా సైన్స్‌ దినోత్సవం

- పాఠశాలల్లో ఆకట్టుకున్న సైన్స్‌ మేళా

నారాయణపేట/టౌన్‌ ఫిబ్రవరి 28 : విద్యార్థులు శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈవో అబ్దుల్‌ ఘనీ అన్నారు. నారాయణపేట డీఈవో కార్యాలయంలో బుధవారం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా డీఈవో సీవీ రామన్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. అనంతరం సీవీ రామన్‌ ఫోరం సభ్యులు నిలువు రాళ్లు పత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది భానుప్రకాష్‌, విద్యాసాగర్‌, నాగార్జునరెడ్డి, సీవీరామన్‌ సైన్స్‌ఫోరం సభ్యులు కనకప్ప, మహేష్‌, రాములు, బస్వరాజ్‌, శ్రీనివాసులు, శశికళ, రంజిత్‌ పాల్గొన్నారు. స్థానిక కృష్ణ గోకులం పాఠశాలలో విద్యార్థులు సైన్స్‌ డే సందర్భంగా ఆయా అంశాలపై ప్రదర్శనలు చేపట్టి వివరించారు. సెక్టోరల్‌ అధికారి నాగార్జున, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ సుదర్శన్‌రెడ్డి, డైరెక్టర్‌ ఉమాదేవి, ప్రిన్సిపాల్‌ అనీష్‌, కృష్ణవేణి పాల్గొన్నారు. పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్‌ డే వేడుకల్లో భాగంగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నారాయణగౌడ్‌ భౌతికశాస్త్రంలో సీవీ రామన్‌ చేసిన కృషిని కొనియాడారు. అనంతరం ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం, సైన్స్‌ పరిశోధనలు, సైన్స్‌ మేళాలో విజేతలుగా నిలిచిన ఎన్‌సీసీ కెడెట్లకు బహుమతులు అందించారు. పేట సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు సైన్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం దత్తుచౌద్రి పాల్గొన్నారు. పేట మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల బాయ్స్‌లో సైన్స్‌ డేను పురస్కరించుకొని సైంటిఫిక్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎంఏ రశీద్‌ పాల్గొని వైజ్ఞానిక నమూనాలను పరిశీలించి విద్యార్థుల సృజనాత్మకతను కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఖవాజా మెహబూబ్‌ఖాన్‌, వార్డెన్‌ ఖాజీం హుస్సెన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:04 PM

Advertising
Advertising