బహిరంగ సభను విజయవంతం చేయండి
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:25 PM
జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 29వ తేదీన జరిగే రైతాంగ ప్రజా నిరసన సభ స్థలాన్ని మాజీ మంత్రి నిరంజ న్‌రెడ్డి శనివారం పరిశీలించారు.
వనపర్తి అర్బన్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 29వ తేదీన జరిగే రైతాంగ ప్రజా నిరసన సభ స్థలాన్ని మాజీ మంత్రి నిరంజ న్‌రెడ్డి శనివారం పరిశీలించారు. సమావేశానికి వచ్చే నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచి ంచారు. కార్యక్రమానికి మాజీ మం త్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు: వనపర్తిలో జరిగే రైతు ప్రజా నిర సన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ పిలు పునిచ్చారు. శనివారం పెబ్బేరు ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత మొండి చేయి చూపిందన్నారు. దిలీప్ కుమార్‌రెడ్డి, సాయినాథ్, ఎల్లయ్య, ఎల్లారెడ్డి, శేఖర్, గోవర్ధన్ పాల్గొన్నారు.
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించు కోవడం లేదని మునిసిపల్ చైర్‌పర్సన్ కరుణశ్రీ విమర్శించారు. శనివారం పట్టణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 29న మాజీ మంత్రి హరీశ్‌రావు వనపర్తి రైతు సద స్సులో పాల్గొంటున్న సందర్భంగా కార్యకర్తలు, రైతులు తరలిరావాలని కోరారు. దిలీప్ రెడ్డి, సురేష్‌బాబు, రాజశేఖర్, మజీద్ పాల్గొన్నారు
Updated Date - Oct 26 , 2024 | 11:25 PM