ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనుమతి లేకుండా ఐస్‌క్రీం తయారీ: ఫ్యాక్టరీ సీజ్‌

ABN, Publish Date - Feb 29 , 2024 | 12:22 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో అనుమతులు లేకుండా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీని పోలీసులు బుధ వారం సీజ్‌ చేశారు.

ఆలేరులో పోలీసులు సీజ్‌ చేసిన ఐస్‌క్రీంలు తయారు చేసే ఫ్యాక్టరీ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఘటన

ఆలేరు రూరల్‌, ఫిబ్రవరి 28: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో అనుమతులు లేకుండా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీని పోలీసులు బుధ వారం సీజ్‌ చేశారు. ఆలేరు ఎస్‌ఐ వెంకట శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలేరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ పక్కన ఉన్న డైరీ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం తనిఖీ చేశారు. ఆ ఫ్యాక్టరీకి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఐస్‌క్రీం తయారు చేస్తున్నారని గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. డైరీ ఐస్‌క్రీం ఫ్యాక్టరీ యజమాని మహ్మద్‌ చాంద్‌మియాపై కేసు నమోదుచేశారు. ఈ ఫ్యాక్టరీకి హైదరాబాద్‌, నల్లగొండలో ఉన్న పలు ఐస్‌ క్రీం కంపెనీల నుంచి వివిధ రకాల ఐ్‌స్‌క్రీంలు ఇక్కడికి తెప్పించి, ఇక్కడి సిబ్బ ంది మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ విక్రయాలు కొనసాగిస్తున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:22 AM

Advertising
Advertising