పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య?
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:37 AM
పీజీ వైద్య విద్యార్థిని లక్ష్మీరచనారెడ్డి ఓటర్ రింగ్‌రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంతక ఇంజక్షన్ తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నారు.
ప్రాణాంతక ఇంజక్షన్ చేసుకోవడంతో మృతి?
పటాన్‌చెరు, ఫిబ్రవరి 12: పీజీ వైద్య విద్యార్థిని లక్ష్మీరచనారెడ్డి ఓటర్ రింగ్‌రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంతక ఇంజక్షన్ తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నారు. అమీన్‌పూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భెల్ హెచ్‌ఐజీ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ లక్ష్మీరచనారెడ్డి(26) బాచుపల్లి మమత వైద్య కళాశాలలో పీజీ గైనకాలజీ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఆమె తండ్రి మోతె ప్రకా్‌షరెడ్డి వ్యాపారి. రోజూ కాలేజీకి ఆమె కారులో వెళ్లి వస్తారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ఆమె ఓటర్ రింగ్‌రోడ్డుపై రోడ్డు పక్కకు కారు పార్క్ చేసి, డ్రైవింగ్ సీట్లోనే ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే, కిష్టారెడ్డిపేట గ్రామ శివారులోని ఔటర్‌రింగ్ రోడ్డుపై కారులో ఓ యువతి అపస్మారక స్థితిలో ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మీరచనారెడ్డిని ఆమె చదువుకుంటున్న మమత ఆస్పత్రికే తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రాణాంతక ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:37 AM