పోలీ్‌సశాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:22 AM
ప్రజలకు పోలీ్‌సశాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.
ఎస్పీ చందనా దీప్తి
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 12 : ప్రజలకు పోలీ్‌సశాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌డేలో భాగం గా పోలీస్ కార్యాలయానికి వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది నుంచి అర్జీలను తీసుకుని వారితో మాట్లాడారు. వారి సమస్యలకు సంబంధించిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుల్లో భూసమస్యలు, భార్యాభర్త ల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యలపైనే ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీ్‌సస్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాద గా మాట్లాడి వినతులు స్వీకరించాలన్నారు. సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఫిర్యాదుదారుడికి భరోసా కలిగించాలన్నారు. అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి
పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సో మవారం దర్బారు నిర్వహించి ఏఆర్ సిబ్బంది సమస్యలను తెలసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల బందోబస్తు లు,ఎస్కార్టులు వంటి వాటి విధి నిర్వహణలో సిబ్బందికి ఎదురయ్యే సమస్యల పరిష్కార దిశగా అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కే.హనుమంతరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐలు హరిబాబు, సంతోష్, సురప్పానాయుడు, ఆర్‌ఎ్‌సఐలు కల్యాణ్‌రాజ్, రాజీవ్, నాగరాజు, మమత సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:22 AM