ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చౌటుప్పల్‌ ఏఎంసీ చైర్మన పదవి ఎస్సీలకు రిజర్వ్‌

ABN, Publish Date - Feb 25 , 2024 | 12:38 AM

చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ చైర్మన పదవిని ఎస్సీ జనరల్‌ కేటగిరి కింద రిజర్వు చేశారు.

చౌటుప్పల్‌ టౌన, పిబ్రవరి 24: చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ చైర్మన పదవిని ఎస్సీ జనరల్‌ కేటగిరి కింద రిజర్వు చేశారు. 18 మంది డైరెక్టర్‌ పదవులలో నాలుగింటిని అఫీషియల్స్‌కు రిజర్వు చేశారు. అందులో స్థానిక మునిసిపల్‌ చైర్మన ( కాంగ్రెస్‌) , పీఏసీఎస్‌ చైర్మన( కాంగ్రెస్‌) , అగ్రికల్చర్‌ ఏడీ, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఉంటారు. రెండు డైరెక్టర్‌ పదవులను ట్రేడర్స్‌కు కేటాయించారు. మిగిలిన 12మంది డైరెక్టర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు జనరల్‌ మహిళ కు ఒక్కొక్క డైరెక్టర్‌ పదవిని రిజర్వు చేయగా, ఏడు డైరెక్టర్‌ పదవులను జనరల్‌ కేటగిరీలో ఉండనున్నాయి. ఈ మార్కెట్‌ పరిధిలోకి చౌటుప్పల్‌ మండలంతో పాటు భూదాన పోచంపల్లి మండలం (పార్ట్‌), నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం( పార్ట్‌) లు వస్తాయి. చౌటుప్పల్‌, గుండ్రాంపల్లి, వెలిమినేడు పీఏసీఎస్‌లు ఈ మార్కెట్‌ పరిధిలో ఉండగా, అందులో వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మన కాంగ్రెస్‌ కు చెందిన వారు కావడంతో డైరెక్టర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. కాగా, పాలకవర్గం పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉండనుంది.

Updated Date - Feb 25 , 2024 | 12:38 AM

Advertising
Advertising