ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గంజాయి విక్రయించి జల్సాలు చేస్తూ ముగ్గురు యువకుల అరెస్టు

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:20 AM

గంజాయి పీల్చుతూ, ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించే యువకులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సూర్యాపేట జిల్లాకేంద్రంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

1.5 కిలోల గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ

సూర్యాపేటక్రైం, ఫిబ్రవరి 12: గంజాయి పీల్చుతూ, ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించే యువకులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే వెల్లడించారు. సోమవారం ఉదయం జాతీయ రహదారి జమ్మిగడ్డ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు జమ్మిగడ్డలోని రాజీవ్‌పార్కు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనికీ చేయగా 1.5కిలోల గంజాయి వారి వద్ద ఉన్న బస్తాలో గుర్తించారు. వారిని ఆదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషనకు తరలించి విచారించారు. హైదరాబాద్‌కు చెందిన రోషనకుమార్‌సింగ్‌ గత సంవత్సరం గంజాయి రవాణ కేసులో ఖమ్మం జైలుకు వెళ్లి వచ్చాడు. అదే సమయంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన మహమ్మద్‌ అంజద్‌పాషా, తెలనాగి మురుగేష్‌ అతనికి పరిచయమయ్యారు. ముగ్గురు కలిసి గంజాయి తీసుకొచ్చుకొని సేవించి మిగిలిన గంజాయి విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలకు ఖర్చు చేసేవారు. తెలనాగి మురుగేష్‌, మహమ్మద్‌ అంజద్‌ పాషా తన స్నేహితుడైన రోషనకుమార్‌ సింగ్‌కు ఫోనచేసి తమకు గంజాయి కావాలని కోరారు. రోషనకుమార్‌సింగ్‌ అరకు నుంచి ఐదు కిలోల గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి, అందులో 3.5కిలోల గంజాయిని కిలో రూ.15వేలకు హైదరాబాద్‌లో విక్రయించి మిగిలిన 1.5కిలోల గంజాయి తీసుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌పార్కుకు చేరుకున్నాడు. అలాగే గంజాయి కోసం స్నేహితులు అంజద్‌పాషా, మురుగే్‌షలు ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి రాజీవ్‌ పార్కుకు చేరుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్‌రావు, డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

మాడ్గులపల్లి: నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. మండల కేంద్రంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం ఉదయం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. రూరల్‌ సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం కేంద్రపార జిల్లా మహంగా గ్రామానికి చెందిన షేక్‌ మాజమ్‌అలీ అనే వ్యక్తి మాడ్గులపల్లి మండల కేంద్రంలోని రాజుస్‌ ఫేమస్‌ ఫాస్ట్‌ ఫుడ్‌సెంటర్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. మండల కేంద్రంలో పలు గంజాయిని చాక్లెట్‌ రూపంలో ప్యాక్‌ చేసి యువకులను టార్గెట్‌గా చేస్తూ అమ్ముతున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ఒక కవర్‌లో ఎండిన గంజాయి 25గ్రాముల ప్యాకెట్‌తోపాటు 676 గ్రాముల మూడు చార్మినార్‌ గోల్డ్‌ మునక్క అనే పేరుగల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మాజమ్‌అలీ ఒడిషా రాష్ట్రంలో ఓ వ్యక్తి వద్ద గంజాయి, గంజాయి చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి మాడ్గులపల్లిలో యువకులకు ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నాడు. నిందితుడు మాజమ్‌అలీపై ఎనడీపీఎ్‌స యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 12:20 AM

Advertising
Advertising