ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తాం

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:07 AM

: సుప్రీం, హైకోర్టుల సూచనలను పాటిస్తూ రాష్ట్రంలో బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తామని బీసీ కమిషన సభ్యుడు రాపోలు జయప్రకాష్‌ అన్నారు.

భువనగిరిలో బీసీ కమిషన సభ్యుడు రాపోలు జయప్రకాష్‌ను సన్మాస్తున్న నాయకులు

భువనగిరి టౌన, సెప్టెంబరు 11: సుప్రీం, హైకోర్టుల సూచనలను పాటిస్తూ రాష్ట్రంలో బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తామని బీసీ కమిషన సభ్యుడు రాపోలు జయప్రకాష్‌ అన్నారు. బీసీ కమిషన సభ్యుడిగా నియమితుడయ్యాక తొలిసారిగా బుధవారం భువనగిరికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా జయప్రకాశ మాట్లాడుతూ కుల గణన ఆధారంగా స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కమిషన ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బీసీ కమిషన వారధిగా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మెన బర్రె జభంగీర్‌, సంఘాల నాయకులు మచ్చ నర్సింహ్మ గౌడ్‌, పిట్టల బాలరాజ్‌, కైరంకొండ వెంకటేశ, చిన్నం కృష్ణ, చల్లగురుగుల రఘుబాబు, బెండ లాల్‌రాజ్‌, నాకోటి రాము, సాల్వేర్‌ ఉపేందర్‌, వడిచర్ల షరత యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:07 AM

Advertising
Advertising