‘ఉపాధి’ లక్ష్యం చేరేనా?
ABN, Publish Date - Feb 15 , 2024 | 12:19 AM
నిరుపేదల కు ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి చేరువయ్యేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
మిగిలింది 45 రోజులే
ఆసక్తి చూపని కూలీలు
ఎన్నికల వేళ, ప్రచార సమయాల్లో నామమాత్రంగా పనులు
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 14: నిరుపేదల కు ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి చేరువయ్యేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్దేశించిన పనుల పూర్తికి ఇక మిగిలింది 45 రోజులే కావడంతో అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. 2005 సంవత్సరంలో రూపొందించి 2006 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఎంతో మంది గ్రామీణ పేద కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పనిలేని నిరుపేదలకు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించాలని సంకల్పించింది. జిల్లాలో ఈ సంవత్సరం 25,44,000 పనిదినాల లక్ష్యంగా నిర్ధేశించారు. అయితే ప్రతీనెల 2,12,000 పనిదినాలు చేసేలా అధికారులు కార్యాచరణ అమలు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంకా 45 రోజులే మిగిలి ఉండగా లక్ష్యం చేరువయ్యేనా అన్న సంశయం నెలకొంది. కూలీల రాక తగ్గుముఖం పట్టడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పథకం ప్రారంభంలో పండగలా సాగిన ఉపాధి హామీ పనులు ఇప్పుడు కూలీల సంఖ్య తగ్గడంతో పనులు కాస్త నెమ్మదించాయి.
ఇంకా 45 రోజులే
ఈఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకో 45 రోజు లే మిగిలింది. కాగా, 25,44,000 పనిదినాల లక్ష్యంలో ఇప్పటికే 23,24,633 పనిదినాలకు చేరింది. లక్ష్యం చేరేందుకు ఇంకో 2,19,367 పనిదినాలు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అధిక గ్రామాల్లో ఉపాధి పనులపట్ల కూలీలు ఆసక్తి చూపడంలేదు. పథకం అమలు జిల్లాలో ఈ ఏడాది ఆశాజనకంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 1.41లక్షల కుటుంబాలు
జిల్లావ్యాప్తంగా 1,41,131 కుటుంబాలుండగా 2,61,127 మంది కూలీలు ఉన్నారు. ఇందుగాను 65,009 కుటుంబాల్లో 85,615మంది కూలీలు ఉపా ధి పనులపై ఆసక్తి కనబర్చగా, ఇంకా 76,304 కుటుంబాల నుంచి 1,75,512 మంది కూలీలు పను ల్లో భాగం కాలేదు. కాగా, ఇందులో సాంకేతిక, ఇతర కారణాలతో 7,880 మంది జాబ్‌కార్డులు లేక పనులకు దూరమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 8 వరకు అధికారులు 23,24,633 పని ది నాలు కల్పించగలిగారు. కాగా, వ్యవసాయ పనులు, వర్షాలు పడినప్పుడు పనులు ఇబ్బమబ్బడిగా సాగగా, ఎన్నికల వేళ, ప్రచార రోజుల్లో కూడా ఉపాధి పనులు నామమాత్రంగానే సాగాయి.
జిల్లావ్యాప్తంగా పనులకు హాజరైన కూలీలు-పనిదినాలు
మండలం కుటుంబాలు వ్యక్తులు పనిదినాలు
భువనగిరి 5,342 6,648 2,03,808
యాదగిరిగుట్ట 3,165 3,820 1,20,646
బొమ్మలరామారం 3,289 3,919 1,34,439
భూదాన్‌పోచంపల్లి 3,045 3,560 1,02,228
ఆలేరు 2,312 2,778 77,717
అడ్డగూడూరు 3,139 4,746 1,00,617
ఆత్మకూర్ (ఎం) 3,741 4,951 1,20,787
వలిగొండ 5,960 7,736 1,64,009
మోత్కూరు 1,837 2,543 60,580
రాజపేట 4,104 6,139 1,41,638
రామన్నపేట 4,365 5,297 1,31,188
చౌటుప్పల్ 4,537 5,522 1,85,059
బీబీనగర్ 3,405 4,023 1,20,298
గుండాల 4,535 6,941 1,73,367
నారాయణపురం 5,598 8,098 2,42,794
మోటకొండూరు 2,622 3,328 74,237
తుర్కపల్లి (ఎం) 4,013 5,566 1,71,221
65,009 85,615 23,24,633
Updated Date - Feb 15 , 2024 | 12:19 AM