పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:38 PM
వానాకాలం ధా న్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బ ందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచిం చారు.
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం ధా న్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బ ందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచిం చారు. బుధవారం కలెక్టర్‌లోని తన ఛాం బర్‌లో వరి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నిర్ధిష్టమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలని సూచించారు. కేంద్రంలో వచ్చిన ధా న్యపు బస్తాలపై గుర్తింపు సంఖ్య ముద్ర వేయాలని తెలి పారు. తమ కు ఇష్టం వచ్చిన మిల్లుకు ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పంట కోతలు ప్రారంభం కాగానే కొనుగోలు కేంద్రా లు ప్రారంభం కావాలని ఆదేశించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్ పాల్గొన్నారు.
Updated Date - Oct 30 , 2024 | 11:38 PM