ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Accident: వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం..

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:34 AM

వికారాబాద్: రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రెండు గంటల పాటు ఓ వ్యక్తి నరకయాతన పడ్డాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో పడిపోయాడు.

వికారాబాద్: రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రెండు గంటల పాటు ఓ వ్యక్తి నరకయాతన పడ్డాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, పోలీసులు.. రైలును నిలిపివేసి.. ప్రయాణీకుల సహాయంతో ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడిని ప్లాట్ ఫాం పగులగొట్టి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గాయపడిన వ్యక్తి రాయచూర్‌కు చెందిన సతీష్‌గా రైల్వే పోలీసులుగుర్తించారు. ఈ ఘటనతో ట్రైన్‌ రెండు గంటల పాటు నిలిచిపోయింది.

రన్నింగ్ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదమే.. అంటూ తరచూ రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు.. అంతేకాకుండా.. అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయినా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ట్రైన్ మిస్ అవుతుందన్న హడావుడిలో సతీష్ అనే వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదం బారిన పడ్డాడు.

Updated Date - Jan 30 , 2024 | 11:34 AM

Advertising
Advertising