ఘనంగా వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 15 , 2024 | 12:17 AM
ఆమనగల్లు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో వసంత పంచమి వేడుకలు బుధవారం ఘనంగా ని ర్వహించారు. పాఠశాల అధ్యక్షుడు పాపిశెట్టి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆర్‌ఆర్‌ఎస్ సభ్యులు, స్థానిక నాయకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు
చిన్నారులకు అక్షరాభ్యాసం
ఆమనగల్లు/కడ్తాల్ ఫిబ్రవరి 14 : ఆమనగల్లు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో వసంత పంచమి వేడుకలు బుధవారం ఘనంగా ని ర్వహించారు. పాఠశాల అధ్యక్షుడు పాపిశెట్టి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆర్‌ఆర్‌ఎస్ సభ్యులు, స్థానిక నాయకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎస్‌ఐ బాల్‌రామ్‌నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వసంత పంచమిని పురస్కరించుకొని శ్రీ సరస్వతీదేవికి, భారత మాతకు పూజలు, యజ్ఞం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యతోనే ప్రగతి సాధ్యమని రాము పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి చుక్క ఆనంద్, ప్రధానాచార్యులు గుత్తి కవిత, ఆచార్యులు స్వాతి, నాయకులు తదితరులున్నారు.
ఆదిభట్ల : వసంత పంచమి పురస్కరించుకొని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లోని శ్రీనివాస్ హైస్కూలులో శ్రీగణపతి, లక్ష్మి, సరస్వతీ హోమం నిర్వహించారు. 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి బాసరలోని సరస్వతీ మాతకు పూజాధికార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ హైస్కూలు చైర్మన్ లక్కరాజు శ్రీనివా్‌సరావు, పిన్సిపల్ రాధిక, టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
షాబాద్ : మండలంలోని శ్రీచైతన్య పాఠశాల, శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, రమే్‌ష, చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 15 , 2024 | 12:17 AM