ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నవాల్గలో హోటల్‌ దగ్ధం

ABN, Publish Date - Mar 12 , 2024 | 12:17 AM

నవాల్గలోని మహేందర్‌రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో మంటలు చెలరేగి ఓ దివ్యాంగుడి కుటుంబం ఉపాధి కోల్పోయింది.

  • ఉపాధి కోల్పోయిన దివ్యాంగుడి కుటుంబం

బషీరాబాద్‌, మార్చి 11: నవాల్గలోని మహేందర్‌రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో మంటలు చెలరేగి ఓ దివ్యాంగుడి కుటుంబం ఉపాధి కోల్పోయింది. ఈ ఘటన బషీరాబాద్‌ మండలం నవాల్గ గ్రామం మహేందర్‌రెడ్డి కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేందర్‌ (దివ్యాంగుడు) తన భార్య రాములమ్మతో కలిసి కట్ట్టెల షెడ్డులో హోటల్‌ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అక్కడే తన సోదరి ఇంట్లో కుటుంబంతో కలిసి నిద్రిస్తుండగా పక్కనే ఉన్న హోటల్‌కు మంటలు ఉవ్వెత్తున చెలరేగాయి. చుట్టూ పొగలు వ్యాపించడంతో సమీప ఇళ్ల ప్రజలు బయటకు వచ్చి దివ్యాంగుడిని అప్రమత్తం చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హోటల్‌ పూర్తిగా మంటలో దగ్ధమైంది. అందులోని ఇతర సామగ్రి పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. బాధితుడు బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఎవరో కావాలనే తన హోటల్‌కు నిప్పుపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. బాధితున్ని ప్రభుత్వం అదుకోవాలని వికలాంగుల సంఘం బషీరాబాద్‌ మండల అధ్యక్షుడు చెరుకు రాజుగౌడ్‌ ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - Mar 12 , 2024 | 12:17 AM

Advertising
Advertising