ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Feb 26 , 2024 | 11:57 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, ఫిబ్రవరి 26: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా బ్యాంకు అధికారులతో కలిసి వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. 28, 29తేదీల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 29న తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, నినాదాలు, పోస్టర్‌ మూడు విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ రాంబాబు, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 173 ఫిర్యాదులను జిల్లా ఎస్సీ కార్పోరేషన్‌ మల్లేశం, జిల్లా సర్వే ల్యాండ్‌ అధికారి రాంరెడ్డిలతో కలిసి కలెక్టర్‌ స్వీకరించారు.

మేడ్చల్‌ ప్రజావాణిలో 120 ఫిర్యాదులు

మేడ్చల్‌, (ఆంధ్రజ్యోతిప్రతినిధి): మేడ్చల్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 120 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 11:57 PM

Advertising
Advertising