ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాధ, రాజారెడ్డి దంపతులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌

ABN, Publish Date - Feb 29 , 2024 | 03:44 AM

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు రాధా రెడ్డి-రాజారెడ్డిదంపతులలకు ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ లభించింది. కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీలో కూచిపూడి నృత్య కళను పరిరక్షిస్తూ వేల మందికి శిక్షణ నిచ్చిన రాఽఽధా రాజారెడ్డి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు రాధా రెడ్డి-రాజారెడ్డిదంపతులలకు ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ లభించింది. కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీలో కూచిపూడి నృత్య కళను పరిరక్షిస్తూ వేల మందికి శిక్షణ నిచ్చిన రాధా రాజారెడ్డి దంపతులకు గతంలోనే పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ పురస్కారాలు వరించాయి. సంగీత నాటక అకాడమీ ఫెలోషి్‌పలో భాగంగా వారికి రూ 3 లక్షల మేరకు నగదు పురస్కారం లభిస్తుంది. 2022, 23 సంవత్సరాలకు సంగీత నాటక అకాడమీ సంగీతం, నృత్యం, రంగస్థలం, సంప్రదాయ, జానపద, గిరిజన సంగీత, నృత్య కళల్లో 92 మందికి అవార్డులు ప్రకటించింది. మరో 80 మంది యువకళాకరులకు కూడా 2022, 23 సంవత్సరాలకు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ పురస్కారాలు లభించిన వారిలో తెలుగువారు ప్రముఖ గాయకుడు, భగవద్గీతను గానం చేసిన ఎల్వీ గంగాధర శాస్త్రి, మద్దాలి ఉషా గాయత్రి (కూచిపూడి), నటరాజ రామకృష్ణ శిష్యుడు పేరిణి ప్రకాశ్‌ (పేరిణి నాట్యం) ఉన్నారు 2022 సంవత్సరానికి గాను మండా సుధారాణి (గాత్రం), వినుకొండ సుబ్రహ్మణ్యం (డోలు వాయిద్యం), భాగవతుల సేతురామ్‌ (కూచిపూడి)లకు సంగీత నాటక పురస్కారాలు లభించాయి. ఈ పురస్కారం కింద తామపత్రం, రూ.లక్ష నగదు ఇస్తారు. 2023 సంవత్సరానికి గాను ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారాలు అందుకున్నవారిలో తెలుగువారు బి మల్లికార్జున రావు (రంగస్థల కళ- మేకప్‌), అంగడి భాస్కర్‌ (జానపద సంగీతం) ఉండగా, 2022 సంవత్సరానికి ప్రముఖ సినీనటుడు రక్త కన్నీరు సి నాగభూషణం మనుమరాలు శ్వేతా ప్రసాద్‌ (గాత్రం), టి.రెడ్డి (కూచిపూడి) ఉన్నారు. యువపురస్కారాల కింద తామపత్రం, రూ.25వేల నగదు ఇస్తారు. కాగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు జగదల్‌పూర్‌లోని మహేంద్ర కర్మ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Feb 29 , 2024 | 03:44 AM

Advertising
Advertising