ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: ‘స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫీషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ’ పేరుతో స్పీడ్‌-19

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:51 AM

మూసీ రివర్‌ఫ్రంట్‌ సహా పంతొమ్మిది అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి.. స్పీడ్‌ (స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరుతో వేగవంతమైన, సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

  • మొత్తం 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

  • స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ

హైదరాబాద్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మూసీ రివర్‌ఫ్రంట్‌ సహా పంతొమ్మిది అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి.. స్పీడ్‌ (స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరుతో వేగవంతమైన, సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా.. ఈ ప్రాజెక్టుల అమలును స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకు ఒకసారి సమావేశమై పురోగతిని సమీక్షిస్తారు. ఈమేరకు.. ‘స్పీడ్‌’ కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు అవసరమైన కార్యచరణ తయారు చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిషన్‌లో భాగంగా చేపట్టే ప్రతి పనికీ సంబంధించి ఆయా విభాగాలు ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తాయి. ఏ గడువులోపల ఎంత పని జరగాలో అధికారులు నిర్దేశిస్తారు. ఎప్పటిలోగా ఆ పనులు పూర్తవుతాయనే అంచనాలను తయారు చేస్తారు. ‘స్పీడ్‌’ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరును సమీక్షించుకుని, ‘స్పీడ్‌’ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళికా విభాగం ప్రత్యేక పోర్టల్‌ను నిర్వహిస్తుంది. రోజువారీ పనుల ప్రగతిని అందులో అప్‌లోడ్‌ చేస్తారు.


స్పీడ్‌-19 ప్రాజెక్టులు ఇవే..

  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌

  • శాటిలైట్‌ టౌన్‌ల అభివృద్ధి

  • మెట్రో రైలు విస్తరణ

  • జీహెచ్‌ఎంసీ పునర్‌వ్యవస్థీకరణ

  • రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణం

  • హైదరాబాద్‌ సిటీలో ఎలివేటెడ్‌ కారిడార్లు

  • రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు

  • ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం

  • మహిళా శక్తి పథకం అమలు

  • జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం

  • రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్సుల నిర్మాణం

  • అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి

  • ఐటీఐలలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు

  • కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం

  • 15 కొత్త నర్సింగ్‌, 28 కొత్త పారా మెడికల్‌ కళాశాలల నిర్మాణం

  • ఆరోగ్య పర్యాటకానికి ప్రచారం

  • ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్‌

  • టెంపుల్‌ సర్క్యూట్‌ టూరిజం

  • మాదకద్రవ్యాల నిరోధక వ్యూహాల అమలు

Updated Date - Aug 24 , 2024 | 03:52 AM

Advertising
Advertising
<