Junior Doctors: సమ్మె విరమించిన జూడాలు
ABN, Publish Date - Aug 24 , 2024 | 03:28 AM
జూనియర్ డాక్టర్ల (జూడా) అసోసియేషన్ సమ్మె విరమించింది.
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జూనియర్ డాక్టర్ల (జూడా) అసోసియేషన్ సమ్మె విరమించింది. కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార సంఘటన నేపథ్యంలో ఈ నెల 14న సమ్మె నోటీసు ఇచ్చారు. తాము లేవనెత్తిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మె విరమిస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి ఔట్ పేషెంట్, వార్డు విధులు, అత్యవసరం సహా అన్ని వైద్య సేవలకు అంతరాయం లేకుండా పని చేస్తాయని ప్రకటించారు.
Updated Date - Aug 24 , 2024 | 03:28 AM