విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:21 PM
ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాఽధికారి గోవింద రాజులు అన్నారు.
కొత్తకోట, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాఽధికారి గోవింద రాజులు అన్నారు. శనివారం పట్టణంలోని దండుగడ్డ కాలనీలోని ప్రాథమిక పాఠశాలతో పాటు అప్పరాల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో తరగతి గదులకు వెళ్లి పాఠ్యాంశాల ప్రశ్నలు విద్యార్థులను అడిగారు. ఉపాధ్యాయులు బోధిం చిన రోజువారి పాఠ్యాంశాలను నేర్చుకోని నోట్ రాసుకోవాలన్నారు. చదువకున్న విద్యార్థులకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పదోఎ తరగతి విద్యార్థులకు ప్రతివారం పరీక్షలు నిర్వహించా లన్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశిం చారు. వంద శాతం ఉత్తీర్ణత ఉండాలని, అందు కు తగ్గట్లుగా అభ్యాసన ఉండాలన్నారు. డీఈవో వెంట ఎంఈవో కృష్ణయ్య, హెచ్‌ఎంలు బంజుల య్య, నరసమ్మ, ఉపాధ్యాయులు ఉన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 11:21 PM