CM Revanth: పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి
ABN, Publish Date - Jan 04 , 2024 | 03:16 PM
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు (Palamuru Ranga Reddy Irrigation Project) జాతీయ హోదా ( National Status) కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కార్ కోరుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) గురువారం నాడు ఢిల్లీ వచ్చారు.
న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు (Palamuru Ranga Reddy Irrigation Project) జాతీయ హోదా ( National Status) కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కార్ కోరుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) గురువారం నాడు ఢిల్లీ వచ్చారు. ఆయనతోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఆ శాఖ అధికారులు ఉన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం రాత్రి 7 గంటలకు భేటీ అవనుంది. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని వినతి పత్రం ఇవ్వనుంది. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని గత ప్రభుత్వం కూడా కేంద్రాన్ని విన్నవించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.
నాగర్ కర్నూల్‌లో (Nagar Kurnool) గల నార్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో గల 10 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగు నీరు, అలాగే తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో తాగునీటి పనులు, రెండో దశలో సానునీటి పనులు జరుగుతున్నాయి. పాలమూరు ప్రాజెక్ట్ కోసం రూ.35,200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 21 ప్యాకేజీలుగా విభజించారు. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహాయించి ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులు జరుగుతున్నాయి.
Updated Date - Jan 04 , 2024 | 03:32 PM