ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైఎస్సార్‌ హయాంలోనే సమస్యకు బీజం

ABN, Publish Date - Feb 13 , 2024 | 03:45 AM

ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పోతిరెడ్డిపాడును 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేలకు పెంచినప్పుడే నదీ జలాల సమస్యకు బీజం పడిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ మౌనంగానే ఉంది: కూనంనేని

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పోతిరెడ్డిపాడును 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేలకు పెంచినప్పుడే నదీ జలాల సమస్యకు బీజం పడిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పదేళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ మౌనంగానే ఉందని విమర్శించారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 విభజన చట్టంలోనే ప్రాజెక్టుల అప్పగింతపై నిబంధనలున్నాయి. అనాడే టీఆర్‌ఎస్‌ గట్టిగా వ్యతిరేకించాల్సింది. వైఎస్సార్‌ 44 వేల క్యూసెక్కులకు పెంచితే జగన్‌ 96 వేల క్యూసెక్కులకు పెంచారు..? దీనిపై గత ప్రభుత్వం ఎందుకు మౌనం వహించింది. రాయలసీమ ప్రాజెక్టు 66 శాతం నిర్మాణం పూర్తయ్యాక గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పుతో ఆగిందే తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 03:45 AM

Advertising
Advertising