ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికలున్నాయి.. విచారణకు రాలేను

ABN, Publish Date - Feb 26 , 2024 | 04:00 AM

లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు తనపై ఉన్నందున విచారణకు హాజరు కాలేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐకి తెలియజేశారు.

పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది

ఆరు వారాల షెడ్యూల్‌ ఖరారైంది

కావాలంటే వర్చువల్‌గా జవాబులిస్తా

విచారణకు పిలవబోమని గతంలో

సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చారు

అది మీకూ వర్తిస్తుంది.. నోటీసులను

ఉపసంహరించుకోండి!

సీబీఐకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత లేఖ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు తనపై ఉన్నందున విచారణకు హాజరు కాలేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐకి తెలియజేశారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ సెక్షన్‌ 41 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ.. ఆదివారం సీబీఐకి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తనకు కొన్ని బాధ్యతలు అప్పగించిందని, రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్‌ ఖరారైందని.. అందుకే సోమవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. నోటీసులు రద్దు చేయాలని, లేదంటే ఉపసంహరించుకోవాలని కోరారు. తన నుంచి సీబీఐకి ఏమైనా సమాధానాలు కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరువుతానంటూ సమాధానమిచ్చారు. 2022 డిసెంబరులో అప్పటి దర్యాప్తు అధికారి సెక్షన్‌ 160 కింద తనకు నోటీసులు ఇచ్చారని, ప్రస్తుతం ఇచ్చిన సెక్షన్‌ 41ఏ నోటీసులు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా రాజకీయ కోణంలో ఆలోచించే విధంగా ఉందన్నారు.

తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున.. ఈ సమయంలో ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని, ఇది తన ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని కవిత స్పష్టం చేశారు. గతంలో ఇదే కేసులో ఈడీ తనకు నోటీసులు జారీ చేయగా తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, తనను విచారణకు పిలవబోమని గతంలోనే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని ప్రస్తావించారు. సొలిసిటర్‌ జనరల్‌ ఇచ్చిన హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని తెలిపారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని గుర్తు చేశారు. కానీ, 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు తనను విచారణకు పిలవడం, కొత్తగా సెక్షన్లు మార్చడం అనేక అనుమానాలకు తావిస్తుందని లేఖలో కవిత పేర్కొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 04:00 AM

Advertising
Advertising