Road Accident Case: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంలో కీలక మలుపు
ABN, Publish Date - Jan 02 , 2024 | 07:23 PM
Road Accident Case: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. షకీల్ కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి తప్పించినందుకు మాజీ సీఐ దుర్గారావుపై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అటు కుమారుడిని రహస్యంగా విదేశాలకు పంపిన మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా కేసు నమోదు చేయనున్నారు.
హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఇటీవల ఓ కారు బీభత్సం సృష్టించిన కేసులో నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అని పోలీసులు గుర్తించారు. అయితే అతడు పరారీలో ఉన్నట్లు గతంలో పోలీసులు తెలిపారు. తాజాగా ఈ కేసు వ్యవహారంలో కీలక ములుపు చోటు చేసుకుంది. షకీల్ కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి తప్పించినందుకు మాజీ సీఐ దుర్గారావుపై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అటు కుమారుడిని రహస్యంగా విదేశాలకు పంపిన మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా కేసు నమోదు చేయనున్నారు.
డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి బీఎండబ్ల్యూ కారును నడుపుతున్న షకీల్ కుమారుడు.... అతివేగంతో వచ్చి ప్రజా భవన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. నిజానికి కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అయినా అతడిని తప్పించి కారులో ఉన్న మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. షకీల్ కుమారుడు సోహెల్‌కు బదులుగా కారులో ఉన్న మరో యువకుడు అబ్దుల్ అసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లుగా కేసు నమోదైంది. దీంతో అతడిని పోలీసులు రిమాండ్‌కు పంపారు. కాగా గతంలోనూ సోహెల్ పలు రోడ్డు ప్రమాదాలకు కారణమైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 02 , 2024 | 07:23 PM