ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని ఓడిస్తాం: పిడమర్తి

ABN, Publish Date - Feb 29 , 2024 | 12:23 AM

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని ఓడించి ఇంటికి సాగనంపుతామని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి అన్నారు.

మాదిగల జోడో యాత్రలో మాట్లాడుతున్న పిడమర్తి రవి

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 28: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని ఓడించి ఇంటికి సాగనంపుతామని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లాకేంద్రానికి చేరుకున్న మాదిగల జోడో యాత్రలో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ వర్గీకరణ హామీని నిలబెట్టుకోని బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. సబ్బండ వర్గాలకు అవసరం లేని ఎన్నో బిల్లులను పార్లమెంట్‌ ద్వారా ప్రవేశపెట్టారని అట్టడుగు వర్గాలకు అవసరమైన ఏ ఒక్క చట్టాన్ని పార్లమెంటు ద్వారా ప్రవేశపెట్టలేదన్నారు. ఇది కేవలం కార్పొరేట్‌ అగ్రకులస్తుల కోసం పనిచేసే పార్టీ మాత్రమేనని అలాంటి బీజేపీని రాష్ట్రం నుంచి తరిమేయాల్సిన బాధ్యత మాదిగలపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు కావాలంటే బీజేపీని ఓడించాలన్నారు. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు మాదిగలకు మూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలన్నారు. తెలంగాణ దళిత బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలకు నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ యూత్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దున్న కొండల్‌, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాతాకుల శేఖర్‌, మహా ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు, బహుజన బోరెల్లి సురేష్‌, బెజవాడ శ్రవణ్‌, నక్క మహేష్‌, జోగు గణేష్‌, అదిమల్ల శంకర్‌, కౌన్సిలర్‌ ఏర్పుల రవి, పుల్లెంల సతీష్‌, నక్క సైదులు, కత్తి సైదులు, మీసాల మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:23 AM

Advertising
Advertising