ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్పిన్నింగ్‌ మిల్లును తెరవాలని కార్మికుల ధర్నా

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:24 AM

మండలంలోని నసర్లపల్లి గ్రామంలో ఉన్న కేవీఎస్‌ స్పిన్నింగ్‌ మిల్లు తెరవాలని అందులో ప నిచేసే కార్మికులు డి మాండ్‌ చేశారు.

నసర్లపల్లి కేవీఎస్‌ స్పిన్నింగ్‌ మిల్లు ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

స్పిన్నింగ్‌ మిల్లును తెరవాలని కార్మికుల ధర్నా

చింతపల్లి, మార్చి 10: మండలంలోని నసర్లపల్లి గ్రామంలో ఉన్న కేవీఎస్‌ స్పిన్నింగ్‌ మిల్లు తెరవాలని అందులో ప నిచేసే కార్మికులు డి మాండ్‌ చేశారు. ఆదివా రం మిల్లు ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కుందూరు సుబ్బారావు 2012 సంవత్సరంలో నసర్లపల్లి గ్రామంలో కేవీఎస్‌ స్పిన్నింగ్‌ మిల్లును నిర్మించారు. స్పిన్నింగ్‌ మిల్లులో వివిధ ప్రాంతాలకు చెందిన 250 కుటుంబాల కార్మికులు పనిచేస్తూ జీవనం పొందుతున్నారు. 2020 సంవత్సరంలో అదే స్పిన్నింగ్‌ మిల్లులో ఆడిటర్‌గా పనిచేసిన కుంభకోణం రంగనాధం, అతని కుమారుడు విజయరాఘవనలు కలిసి లీజుకు తీసుకున్నారు. మూడేళ్లుగా తండ్రీ కుమారులే మిల్లును నిర్వహిస్తున్నారు. కాగా మిల్లుకు సంబంధించిన అద్దె చెల్లించకపోవడంతో ఐదు నెలల క్రితం కుందూరు సుబ్బారావు మిల్లుకు వచ్చారు. అద్దె విషయంలో గలాట జరగడంతో రంగనాథం, అతని కుమారుడు మిల్లుకు తాళం వేసి వెళ్లిపోయారు. ఐదు నెలలుగా కార్మికులకు పనులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం స్పిన్నింగ్‌ మిల్లు యజమాని కుందూరు సుబ్బారావు మిల్లు వద్దకు వచ్చాడని తెలుసుకొని అందులో పనిచేసిన కార్మికులు అక్కడికి చేరుకున్నారు. మిల్లును తెరిచి తమకు పనులు కల్పించాలని కార్మికులు ధర్నా నిర్వహించారు. కాగా లీజుకు తీసుకున్న వ్యక్తి తనకు అద్దె చెల్లించి మిల్లును నడుపుకున్న పరవాలేదని, లేక లీజును రద్దు చేసి తనకు అప్పగిస్తే మిల్లును నడిపిస్తానని కార్మికులకు సుబ్బరావు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నా విరమించారు.

Updated Date - Mar 11 , 2024 | 12:24 AM

Advertising
Advertising