గుడిలో కేక్ కట్ చేశారు.. అడిగితే గుడ్డు లేదన్నారు..
ABN , First Publish Date - 2020-11-30T19:40:50+05:30 IST
విజయవాడ: దుర్గ గుడి చైర్మన్ పైల సోమినాయుడు జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి.

విజయవాడ: దుర్గ గుడి చైర్మన్ పైల సోమినాయుడు జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి. గుడిలో కేక్ కట్ చేసి ఆయన వివాదానికి తెరదీశారు. అదేమని అడిగితే కేక్‌లో గుడ్డు లేదని సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో సోమినాయుడు జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్‌ను సోమినాయుడు కట్ చేయడం వివాదాస్పదంగా మారింది. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయంలో కేక్ కట్ చేశారని.. భక్తులు, హిందూ పరిరక్షణ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గుడ్డు కలవని కేక్ కట్ చేశానని చైర్మన్ సోమినాయుడు చెప్పడం గమనార్హం.